పీఎం గ‌తిశ‌క్తి జాతీయ మాస్ట‌ర్ ప్లాన్‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ

0 5,599

న్యూఢిల్లీ ముచ్చట్లు:

పీఎం గ‌తిశ‌క్తి జాతీయ మాస్ట‌ర్ ప్లాన్‌ను ఇవాళ ప్ర‌ధాని మోదీ ఆవిష్క‌రించారు. రాబోయే 25 ఏళ్ల కోసం ఫౌండేష‌న్ వేస్తున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. జాతీయ మాస్ట‌ర్ ప్లాన్ విధానంతో 21వ శ‌తాబ్ధ‌పు అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌కు గ‌తిశ‌క్తి ల‌భిస్తుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ విధానం ద్వారా అభివృద్ధి ప‌నులు నిర్ణీత స‌మ‌యంలో ముగుస్తాయ‌న్నారు. గ‌తంలో ఎక్క‌డ‌కు వెళ్లినా వ‌ర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్న బోర్డులు క‌నిపించేవ‌ని, ఆ బోర్డుల‌ను చూసి ఈ పనులు ఎన్న‌డూ ముగియ‌వ‌ని ప్ర‌జ‌లు అనుకునేవార‌ని, ప్ర‌జ‌ల్లో అప‌న‌మ్మ‌కం పెరిగేద‌ని, కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారింద‌న్నారు. ప్ర‌ణాళిక‌ల‌ను ప‌క‌డ్బందీగా రూపొందించామ‌ని, అభివృద్ధి ప‌నుల్లో గ‌తిని తీసుకువ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. రాజ‌కీయ పార్టీలు గ‌తంలో ఎన్న‌డూ మౌళిక స‌దుపాయాల అభివృద్ధిపై దృష్టిపెట్ట‌లేద‌న్నారు. ఆ పార్టీల మ్యానిఫెస్టోల్లో అవి ఉండేదికాద‌న్నారు. సుస్థిర‌మైన అభివృద్ధి సాధించాలన్నా.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌న్నా.. ఉద్యోగ క‌ల్ప‌న చేయాల‌న్నా.. నాణ్య‌మైన మౌళిక స‌దుపాయాలు అవ‌స‌రమ‌ని మోదీ అన్నారు. ఢిల్లీలోని ప్ర‌గ‌తి మైదాన్‌లో ఎగ్జిబిష‌న్ కాంప్లెక్స్ కొత్త మోడ‌ల్‌ను కూడా ప్ర‌ధాని స‌మీక్షించారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Prime Minister Modi unveils PM Gatishakti National Master Plan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page