ఐదేళ్ల బాలికపై ఆత్యాచారం

0 4,595

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామం లో ఓ కామాంధుడు ఐదేళ్ల బాలిక పై  అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జక్కలచెరువు గ్రామానికి చెందిన చరణ్ (19)అనే యువకుడు అయిదేళ్ల బాలికను అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలి బంధువులు బాలికను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు  బాలిక అత్యాచారానికి  గురైనట్టు  నిర్ధారించారు. అనంతరం  బాలిక ప్రైవేట్ పార్ట్ బాగా దెబ్బతినడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించాలని వైద్యులు తెలిపారు  . దీంతో బాధితురాలి బంధువులు తో పాటు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడి ఇంటిపై ఘర్షణగు  దిగారు.దీంతో జక్కలచెరువు గ్రామం లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం బాధితురాలి బంధువులు పోలీస్ స్టేషన్  ఎదుట బైఠాయించి నిందితుడిని అదుపులోకి తీసుకొని బాలికకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.దీంతో హుటాహుటిన పోలీసులు లు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల గొడవలను సద్దుమనచి   బాధితురాలు బంధువులకు  ఖచ్చితంగా చట్టపరమైన న్యాయం చేస్తామని 24 గంటల లోపు నిందితున్ని అదుపులోకి తీసుకుని తగు చర్యలు చేపడతామని డిఎస్పీ చైతన్య తెలపడంతో భాడితురాలి  బంధువుల ఆందోళన విరమించారు.అనంతరం గ్రామంలో పోలీసుల బలగాలను మోహరించి భద్రతా చర్యలు చేపట్టారు. నిందితుడి  కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు..

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Rape of a five-year-old girl

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page