చదళ్ల లో శ్రీ దుర్గా దేవి అవతారంలో శ్రీ చౌడేశ్వరి దేవీ

0 9,269

పుంగనూరు ముచ్చట్లు:

 

 

చదళ్ల గ్రామం లో వెలసిన శ్రీ సప్త మాతృక సమేత శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవీ అమ్మవారి దసరా బ్రహ్మోత్సవాలలో భాగంగా 7 వ రోజు శ్రీ దుర్గా దేవి అవతారం లో భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం ఉదయం నుండీ భక్తులు వందలాదిగా తరలివచ్చి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆద్వర్యంలో దసరా శరన్నవరాత్రులు సందర్బంగా ప్రతి రోజూ సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం నెల్లూరుకు చెందిన సురేష్ గ్రూపు వారిచే కోలాటములు, భక్తి పాటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి రోజు ఇక్కడకు విచ్చేసే భక్తులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులను ఇస్తున్న ఆలయ కమిటీ ఈ రోజు మొత్తం 12 మందికి బహుమతులను అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎన్. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దర్శనార్థం వీచ్చేయు భక్తులకు మధ్యాహ్నం, సాయంత్రం రెండు పూటలా భోజన వసతి ఏర్పాటు చేశామని తెలియచేసారు. ప్రతిరోజు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అదే విధంగా ఈ సంవత్సరం లక్కీ డ్రా ద్వారా ఆలయానికి విచ్చేసే భక్తులకు వివిధ బహుమతులను అందిస్తున్నామని తెలియజేసారు. భక్తులు విచ్చేసి అమ్మ వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి, శ్రీ చౌడేశ్వరీ దేవి కృపాకటాక్షాలకు పాత్రులవ్వాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమం లో శ్రీ చౌడేశ్వరి దేవీ ట్రస్ట్ సభ్యులు. శివ కుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, రవి కుమార్,భాస్కరరెడ్డి, శంకర్ రెడ్డి, జయ పాల్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మహేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి, నాగ రాజ రెడ్డి, మల్లిఖార్జున్, పురుషోత్తం రెడ్డి, పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Sri Chowdeshwari Devi in the incarnation of Sri Durga Devi in Chadalla

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page