భార్యను విష స‌ర్పంతో కాటేయించి చంపించిన ఘ‌ట‌నలో భర్తకు రెండుసార్లు జీవిత‌ఖైదు

0 9,667

తిరువనంతపురం

కట్టుకున్న భార్యను విష స‌ర్పంతో కాటేయించి భార్య ఉత్ర మ‌ర‌ణానికి కార‌ణ‌మైన భ‌ర్త సూర‌జ్‌కు కొల్లాం ట్ర‌య‌ల్ కోర్టు రెండు  జీవిత‌ఖైదు శిక్ష‌ల‌ను విధించింది.ఈ మేరకు  కొల్లాం అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి ఎం మ‌నోజ్ తీర్పునిస్తూ.. ఇది అత్యంత అరుదైన కేసు అని అన్నారు. నిందితుడు సూర‌జ్‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని ప్రాసిక్యూష‌న్ కోరినా.. కోర్టు మాత్రం డ‌బుల్ జీవిత ఖైదు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. కేర‌ళ‌కు చెందిన సూర‌జ్‌పై న‌మోదు అయిన కేసుల్లో .. ఓ కేసులో ప‌దేళ్లు, మ‌రో కేసులో ఏడేళ్ల శిక్ష ప‌డింది. మొత్తంగా సూర‌జ్ 17 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంది. జీవిత‌ఖైదు శిక్ష‌తో పాటు అత‌నికి 5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు.2020 మార్చిలో ఉత్ర‌పైకి ఒక విషసర్పాన్ని వదిలాడు సూర‌జ్‌. దాని కాటుతో ఉత్ర తీవ్ర అనారోగ్యంపాలైంది. 52 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాక కోలుకుంది. ఆ వెంటనే రూ.10 వేలు ఖర్చుపెట్టి మరోసారి పాములు పట్టే సురేష్ అనే వ్యక్తిని సూరజ్‌ పిలిపించాడు. అతని సాయంతో మే నెలలో తాచుపామును భార్యపైకి పంపించాడు. అది కూడా ఆమెను కాటేసింది. అయితే ఈసారి ఆమె కన్నుమూసింది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: The husband was twice sentenced to life imprisonment for stabbing his wife to death with a poisonous snake

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page