శాంతి భద్రతలను పరిరక్షించి ప్రజలకు సేవ చేయజడంలో ముందుండాలి.

0 9,690

తిరుపతి  ముచ్చట్లు:

 

సమీక్షా సమావేశంలో డి.ఐ.జి  క్రాంతి రానా టాటా, ఐ.పి.యస్ ,జిల్లా యస్.పి  వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ .అనంతపురం రేంజ్ డి.ఐ.జి  క్రాంతి రానా టాటా, ఐ.పి.యస్ , తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి  వెంకట్ అప్పల నాయుడు, ఐ.పి.యస్  క్రైమ్ కేసులపై నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా పోలీస్ అధికారులతో ఈ రోజు పోలీస్ గెస్ట్ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు.

- Advertisement -

❇️ తరచు నేరాలు జరగడంపై దృష్టి సారించాలి.

❇️ నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.

❇️ శాస్త్రీయ కోణంలో కేసు దర్యాప్తు చేయాలి.

❇️ సాంకేతిక కోణంలో ప్రతి కేసును ఆలోచించాలి.

❇️ క్రైమ్ కు సంబంధించి సాంకేతిక పరమైన విషయాలు, పరిజ్ఞానం ప్రతి ఒక అధికారి, సిబ్బంది తెలుసుకోవాలి. పోక్సో కేసులపై ఆలస్యం లేకుండా త్వరితగతిన దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలి.నేర సమీక్ష సమావేశంలో విచారణలో ఉన్న కేసులను మరియు పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న క్రైమ్ (Property offence) కేసుల ఫిర్యాదులను పరిశీలించి వాటిపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.దొంగతనాలు జరగకుండా ముఖ్యమైన ప్రాంతాలలో తగిన బీట్లు, పికట్స్, లర్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకొని అధికారులు తరువుగా బీట్ చెక్ చేసుకొని సిబ్బందికి సూచనలు ఇవ్వాలని, అలాగే దొంగతనాలను అరికట్టాలని, స్టేషన్ కు వచ్చు పిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా రేంజ్ డి.ఐ.జి  తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా యస్.పి  మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగిందని ఇప్పటికే ప్రత్యేక బృందాలను కూడా రంగంలో దించి అంతర రాష్ట్రాలకు పంపించి పాత, కొత్త నేరస్తులను గుర్తించి ఆరా తేస్తున్నామన్నారు.

 

 

జిల్లా వ్యాప్తంగా ఫింగర్ ప్రింట్ పిన్స్, పాపిలాన్ (మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్) పరికరంతో రద్దీ ప్రాంతంలో, రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్ మరియు అనుమానిత ప్రతి వ్యక్తిని ఈ డివైస్ ద్వారా ప్రింట్ లను చెక్ చేస్తూ దొంగతనాల నివావరణ కొరకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంన్నామన్నారు.నగరంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తూ నేరాలను నివారించడంలో భాగంగా LHMS (Locked house monitoring system) వినియోగం కొరకు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. పోలీస్ సిబ్బందిచే లాక్డ్ హౌస్ లను గుర్తించి ఆ ప్రాంతంలో దొంగతనాలు జరగకుండా తగిన బీట్లు ఏర్పాటు చేస్తున్నాము.ప్రజలు కూడా నేరాలు నియంత్రించడానికి పోలీస్ వారికి సహకరించి LHMS ను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా యస్.పి  తెలియజేసారు.ఈ సమావేశంలో అడిషనల్ యస్.పి లు అడ్మిన్  ఇ.సుప్రజ మేడం , తిరుమల  మునిరామయ్య , జిల్లాలోని డి.యస్.పి లు, సి.ఐ లు పాల్గొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: We must take the lead in maintaining peace and security and serving the people.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page