ఇష్టారాజ్యంగా తయారైన హిందూస్మశాన వాటిక

0 7,601

 

కరోనా వేవ్ నుండి కాకినాడ ఆర్ టి సి  వెనుక వున్న విజ్జపు రెడ్డి హిందూ స్మశాన వాటిక నిర్వహణ తీరు శోచనీయంగా తయారయ్యిందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. అంత్యక్రియల్లో కాటి కాపరి నిర్వహణ కరువయ్యిందన్నారు. సెప్టిక్ లెట్రిన్ ట్యాంకులు నిర్వహణ చేసినట్టుగా శవ దహనాలు జరుగు తున్నాయన్నారు. సేవ రూపంలో జరగాల్సిన అంత్యక్రియలు సబ్ కాంట్రాక్ట్ తరహాలో ఫక్తువ్యాపారంగా మారాయన్నారు.  గంజాయి మత్తు పదార్థ మాదక ద్రవ్యాల సేవనసరఫరా కేంద్రంగా మారిందన్నారు. సెప్టిక్ లెట్రిన్ ట్యాంకర్ల సర్వీస్ పార్కింగ్  ప్రదేశంగా హిందూ స్మశాన వాటిక మారిన తీరు కాకినాడ కార్పోరేషన్ గ్రహించక పోవడం సిగ్గుచేటన్నా రు. హిందూ ధార్మిక సంఘాలు హిందూ స్మశాన వాటిక నిర్వహణ గురించి కార్పోరేషన్ అధికారులకు తెలియజెప్పాల్సిన అవసరం వుందన్నారు.అనువంశికవృత్తి రీత్యా కాటికాపరి కుటుంబా లకు చెందిన 4గురు సిబ్బందిని అకారణంగా తొలగించి ఇష్టారాజ్యంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న తీరుపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కాటి కాపరి కుటుంబాలను కాదని అన్యులతో హిందూ స్మశాన వాటిక క్రియలు చేపట్టడం క్షంతవ్యకరమని రమణ రాజు పేర్కొన్నారు. కరోనా టైం నుండి వెళ్ళ గొట్టిన 4గురు కాటికా పరి సిబ్బందికి 30 ఏళ్లుగా స్మశాన క్రియలు నిర్వహించడం వలన బయట ఎవ్వరూ పనుల్లోకి పెట్టుకోక పోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతు న్నాయని జిల్లా కలెక్టర్ పరిశీలించాల్సిన అవసరం వుందని అన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:A Hindu crematorium made at will

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page