తెప్పోత్సవం కార్యక్రమంపై అధికారుల కీలక ప్రకటన

0 7,759

విజయవాడ ముచ్చట్లు:

ప్రతియేటా కృష్ణా నదిపై జరిగే తెప్పోత్సవంపై ఆధికారులు కీలక ప్రకటన చేసారు. జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కృష్ణా నదిలో లక్ష క్యూసెక్ ల వరకూ నీరు వదులుతున్నారు. అందుకే ఈసారి కూడా ఫంటు పై మాత్రమే పూజలు నిర్వహిస్తారు. తెప్పోత్సవం ఆగమన నియమనిబంధనలకు అనుగుణంగా జరుపుకుంటాం. తెప్పోత్సవం ప్రాణగంలో ప్రజలకు అనుమతి లేదు. సుమారు 5:30 గంటలకు పూజాదికార్యక్రమాల తర్వాత తెప్పోత్సవం ఉంటుంది. నవరాత్రి సంబరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగాయి, భక్తులు కూడా సహకరించారు. ఇంకా రెండుమూడు రోజులు భక్తులు, భవానీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసాం. దసరా ఉత్సవాలు సజావుగా జరగడానికి సహకరరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని అన్నారు.
పోలీసులు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ గత ఏడు రోజులుగా దసరా ఉత్సవాల విజయవంతంగా జరిగాయి. అనుకున్న దానికంటే భక్తులు ఎక్కువగా వచ్చారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు జరుపుకున్నాము. శుక్రవారం భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది కనుక అన్ని ఏర్పాట్లు చేసాము. రేపు సాయంత్రం 5:30 గంటలకు తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుంది.  దానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాటు చేశామ్. కనకదుర్గ ఫ్లై ఓవర్, కుమ్మరిపాలెం వైపు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:A key statement from the authorities on the Theppotsavam program

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page