బాలయ్య సలహానే నా అజెండా

0 7,791

హైదరాబాద్  ముచ్చట్లు:

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలు సజావుగా జరగలేదని.. విపరీత ధోరణి ఉన్న మనుషులో కలిసి నడవలేమని ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. అయినప్పటికీ మంచు విష్ణు తన ఫ్యూచర్ ప్లాన్ త్వరలో చెబుతానంటూ.. ‘మా’ అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్నారు. అందర్నీ కలుపుకుని వెళ్తానని చెబుతున్నారు. ఈ క్రమంలో ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. అండగా నిలిచినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో చిరంజీవిని కూడా కలుస్తానని మంచు విష్ణు వెల్లడించారు.మద్దతుగా నిలిచినందుకు బాల అన్నకు ధన్యవాదాలు. అందుకే ఆయన్ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశాను. ఆయన కూడా మా కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని హామీ ఇచ్చాడు. మా కుటుంబాన్ని ఒక్కటి చేసి.. ఉన్నతి కోసం ఫోకస్ పెట్టమని నాకు సలహా ఇచ్చారు.

- Advertisement -

ఇదే ప్రస్తుతం నా ఎజెండా” అని మంచు విష్ణు పేర్కొన్నారు.కాగా మోహన్ బాబు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బాలయ్య అల్లుడికి వ్యతిరేకండా ప్రచారం చేశామని.. అయినప్పటికీ అతడు అవేమీ మనుసులో పెట్టుకోకుండా మంచు విష్ణుకు మద్దతుగా నిలిచి ఓటు వేశాడని తెలిపారు. అందుకే బాలయ్యను మొదట కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు. మరో వైపు ‘మా’ అధ్య‌క్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ‘మా’ నూత‌న అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. విష్ణు (Manchu Vishnu) నేతృత్వంలోని ‘మా’ కొత్త టీం ఈ నెల 16న ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతుంది. ఈ నేప‌థ్యంలో న‌టుడు మోహ‌న్ బాబు  త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన వారితోపాటు మిగిలిన అంద‌రినీ కూడ‌గ‌ట్టే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ మోహ‌న్‌బాబు, విష్ణుతో క‌లిసి బాల‌కృష్ణ  ఇంటికి వెళ్లారు. బాల‌కృష్ణ‌తో ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు.అనంత‌రం మోహ‌న్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. విష్ణుకు తోడుంటాన‌ని మా ఎన్నిక‌ల స‌మ‌యంలో బాల‌కృష్ణ ప్ర‌క‌టించారు. అన్న‌ట్టుగానే విష్ణుకు అండ‌గా ఉండి ఓటేశారు. గ‌త ఎన్నిక‌ల్లో బాలయ్య బాబు అల్లుడిని ఓడించడానికి ప్ర‌చారం చేశాను. అన్నీ మ‌రిచిపోయి బాల‌కృష్ణ ఓటేశారని, అందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌ని అన్నారు.మా’ ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ప‌రిణామాలపై ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు ప్రెస్ మీట్ పెట్టి ప‌లు విమ‌ర్శ‌లు చేయ‌డంతో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఎన్నికైన 11 మంది రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మంచు విష్ణు చేసే ప‌నుల‌కు బ‌య‌ట నుంచి స‌హ‌క‌రిస్తూ..ఎప్ప‌టిక‌పుడు రిపోర్టు తెప్పించుకుని ప్ర‌శ్నిస్తామని ప్ర‌కాశ్ రాజ్ టీం చెప్పింది. ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ‌తో మోహ‌న్ బాబు స‌మావేశం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Childhood advice is my agenda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page