విజయదశమి పూజలు చేసిన డీఐజీ

0 7,886

నల్లగొండ ముచ్చట్లు:

విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, జిల్లా అన్ని రంగాలలో అగ్రభాగంలో ఉండాలని ఆకాంక్షించారు డిఐజి ఏ.వి. రంగనాధ్. గురువారం  జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో డిఐజి రంగనాధ్, సతీమణి లావణ్య రంగనాధ్ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలన్నారు. అనంతరం ఎం.టి. విభాగం వద్ద వాహనాల పూజ నిర్వహించి జిల్లా ప్రజలకు పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలలో డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ నర్మద, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:DIG who worshiped Vijayadashami

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page