జోగులాంబకు పట్టు వస్త్రాలు సమర్పించిన కర్నూలు జిల్లా కలెక్టర్

0 7,579

గద్వాల ముచ్చట్లు:

దసరా శరన్నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకొని జోగులాంబ జిల్లా, అలంపూర్ గ్రామంలో 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానంలో శ్రీ  జోగులాంబ అమ్మవారికి కర్నూలు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు సంప్రదాయబద్దంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ కు జోగులాంబ జిల్లా అధికారులు, ఆలయ ఈవో, వేద పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలబ్రహ్మహేశ్వర స్వామివారికి అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, అష్టోత్తర పూజాది కార్యక్రమాలు నిర్వహించి పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో  జోగులాంబ అమ్మవారి దేవస్థానం చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్, దేవస్థానం ఈవో మఠం వీరేశం, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గోన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:District Collector of Kurnool presented silk garments to Jogulamba

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page