ఆమినిగుంట చెర్వుకు గండి

0 9,275

-మరో మూడు చెర్వులకు పొంచి ఉన్న ప్రమాదం

-సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిథులు
-అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు

- Advertisement -

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలోని ఆమినిగుంట చెర్వుకు గండి పడి చెర్వు కట్ట గురువారం తెగిపోయిన సంఘటన జరిగింది.గత యేడాది కురిసిన భారీ వర్షాలకు గతంలో ఈ చెర్వు కట్ట తెగిపోవడంతో రైతులు,అధికారుల సూచనలతో కట్ట తెగిన ప్రదేశంలో మట్టిన తోలి కట్ట మరమ్మత్తులు చేపట్టారు. బుధవారం రాత్రి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ఆమినిగుంట చెర్వుకు భారీగా వర్షపు నీరు చేరింది. చెర్వు నిండిపోవడంతో పాటు నీటి ఉదృతి పెరగడంతో మళ్లీ చెర్వు కట్ట కు అదే ప్రదేశంలో గండి పడి కట్ట తెగిపోయింది. దీంతో వరదనీటి ఉదృతి పెరగడంతో కింద భాగంలో ఉన్న అనంతరాయుని చెర్వు, చిట్రెడ్డిచెర్వు, చారాల చెర్వులపైకి వరదనీరు భారీగా చేరడం, ఆయా చెరువుల కట్టలు బలహీనంగా ఉండడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమైయ్యారు. ఆయా చెర్వుల కింద వరిపంట, కరేపాకు తోట, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. జేసీబీల సహాయంతో నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోన్నారు. సంఘటనా స్థలాన్ని జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి,వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌, బూత్‌ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, తహసీల్దార్‌ మాధవరాజు, విఆర్వో మల్లికార్జునరెడ్డి, ఇరిగేషన్‌ ఏఈ వెంకటయ్యలు సందర్శించారు.రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు ,అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Go to Aminigunta pond

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page