ఆర్యన్‌ బెయిల్‌పై తీర్పు రిజర్వు.. 20వరకు జైలులోనే!

0 9,688

ముంబయి ముచ్చట్లు:

 

ముంబయిలోని క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో ఇటీవల అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయనకు బెయిల్‌ ఇచ్చే అంశంపై తీర్పును ప్రత్యేక న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఈ నెల 20న బెయిల్‌పై తీర్పు వెలువరించనున్నట్టు వెల్లడించింది. దీంతో ఆర్యన్‌ను తిరిగి జైలుకు తరలించారు. ఆర్యన్‌, అబ్బాజ్‌, మూన్‌మూన్‌ ధామేచాల బెయిల్‌ పిటిషన్‌పై ఎన్సీబీ, డిఫెన్స్‌ న్యాయవాదుల మధ్య కోర్టులో సుదీర్ఘవాదనలు కొనసాగాయి. ఆర్యన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్సీబీ వాదించింది. అనంతరం బెయిల్‌పై తీర్పును జడ్జి వీవీ పాటిల్‌ ఈ నెల 20కు వాయిదా వేశారు. దీంతో ఈ నెల 20వరకు ఆర్యన్‌ జైలులోనే ఉండనున్నారు.

 

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Judgment reserved on Aryan bail .. in jail till 20!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page