తేజేష్ రెడ్డి మృతి పట్ల పలు అనుమానాలు-తల్లి జ్యోతి

0 5,652

పీలేరు ముచ్చట్లు:

తన కొడుకు తేజేష్ రెడ్డి మృతి పట్ల మృతుడి తల్లి జ్యోతి పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ ఇద్దరే నా బిడ్డను చంపించారని ఆరోపించింది. టేజేష్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.  జ్యోతి మాట్లాడుతూ భూదేవిరెడ్డి, రవీందర్ రెడ్డి లను బహిరంగంగా ఉరి తీసి చంపాలి. డబ్బు కోసమే పంపించారు.  నాకు న్యాయం చేయండి అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. కొడుకును చంపేశారు అన్న విషయం తెలుసుకుని కువైట్ నుంచి గురువారం ఉదయం జ్యోతి పీలేరు కు చేరుకున్నారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. భూదేవి రెడ్డి, రవీందర్ రెడ్డి లు డబ్బు కోసమే తన బిడ్డను ఎత్తుకెళ్లి చంపి బొప్పాయితోటలో పడేశారని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బోరున విలపిస్తూ ఆరోపించారు. లేక లేక  ఒక్కగానొక్క బిడ్డ కలిగాడని, అయితే అతన్ని కూడా దారుణంగా గొంతు నులిమి హత్య చేయడం ఏంటంటూ నిలదీశారు. ఇంత దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించి, మాకు న్యాయం చేయాలంటూ విలపించారు. ఈనెల 12వ తేదీన చిత్తూరు జిల్లా, కె.వి పల్లి మండలం, చీనేపల్లె పంచాయతీ పరిధిలోని ఎగువ మేకలవారిపల్లిలో తేజోస్ రెడ్డి (8) అదృశ్యమయ్యాడు. తేజోష్ రెడ్డి మేనమామ వేణుగోపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె.వి పల్లి ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేశారు. అదృశ్యమైన బాలుడు మేకలవారిపల్లికి సమీపంలోని బొప్పాయి తోటలో శవమై కనిపించాడు. మృతుడి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న జ్యోతి కువైట్ నుంచి గురువారం ఉదయం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకుంది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:’Many suspicions about Tejesh Reddy’s death – Mother Jyoti

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page