ఎగ్జిబిషప్ టెకెట్లలో ఎమ్మెల్యేకు వాటా

0 9,663

ప్రొద్దుటూరు  ముచ్చట్లు:

 

ప్రొద్దుటూరు లో కరోనా వంటి భయంకర పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు బయటపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు 50 రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టి ప్రజలను దోచుకుంటున్నారని ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. యాభై  రూపాయల టికెట్ లో 25 రూపాయలు పెట్టుబడి పెట్టిన కాంట్రాక్టర్ కు మిగతా 25 రూపాయలు ఎమ్మెల్యే రాచమల్లు కు , ఆయన బావమరిది బంగారు రెడ్డి కి వెళ్తుందని అయన ఆరోపించారు. సాక్షాత్తు 38 వ వార్డ్ వైకాపా  కౌన్సిలర్ 50 టికెట్ పెట్టి ఎగ్జిబిషన్ కు వెళ్లానని ఆవేదన చెందాడు. ఎంతో గొప్పగా మాటలు చెప్పే ఎమ్మెల్యే రాచమల్లు కు ఈ విషయం కనిపించలేదా. రాచమల్లు కు 25 రూపాయలతో సంబంధం లేకుంటే గెజిట్ ప్రకారం 25 రూపాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అధికంగా వసూలు చేసిన 25 రూపాయలు రాచమల్లు, బంగారు రెడ్డికే వెళ్తుంది. ఎగ్జిబిషన్ కు వచ్చే ప్రజల నుంచి రాచమల్లు టాక్స్ వసూలు చేస్తున్నారు. ప్రజలందరూ గమనించండని అన్నారు. ఈ విషయంపై కలెక్టర్ కు పిర్యాదు చేస్తున్నాం. పరిస్థితిలో మార్పు రాకపోతే టీడీపీ తరుపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అయన అన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: MLA’s share in Exhibition tickets

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page