లైవ్ లో మర్డర్

0 7,589

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణ ఘటన చోటు చేసుకుంది. హస్మాబాద్ బండ్ల గూడ రోడ్ పై ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు వేటాడి దారుణంగా హత్య చేశారు.  సమాచారం అందుకున్న పోలీసులుసంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నడిరోడ్డు పై జరిగిన దుండగుల దాడిలో మరణించిన వ్యక్తి పాతబస్తీ బర్కస్ కి చెందిన హమీద్ బిన్ ఆల్ జుబేది గా పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తున్నారు. వివరాల్లోకి వెళితేహైదరాబాద్ పాతబస్తీ బర్కస్ కి చెందిన వ్యక్తి హమీద్ బిన్ ఆల్ జుబేది వెస్టర్న్ యూనియన్ ఆఫ్ మనీ నిర్వహిస్తున్నాడు. ఈ రోజు హమీద్ బండ్ల గూడా ప్రధాన రహదారి పై కారులో వెళ్తుండగా.. రోడ్డు మీద కొందరు గుర్తు తెలియని దుండగులు కారు ఆపి మరణయుధాలతో దాడి చేసేశారు.    కారులో వెళ్తున్న హమీద్ ను బండ్లగూడా వద్ద ముగ్గురు వ్యక్తులు అడ్డగించి కత్తులతో దాడి చేసి అక్కడి నుండి పారిపోయారు. ఇది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా  స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన హమీద్ ని 108లో ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. అయితే అప్పటికే వైద్యులు హమీద్ చనిపోయాడని నిర్ధారించారు.  ఈ ఘటనపై చంద్రయన్ గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags;Murder in Live

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page