భూమన చొరవతో రుయా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది కి అందిన జీతాలు

0 7,862

 

– భూమన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపిన సెక్యూరిటీ సిబ్బంది

- Advertisement -

తిరుపతి  ముచ్చట్లు:

 

చాలా కాలంగా
జీతాలు అందకుండా ఇబ్బందులు పడుతున్న
రుయా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందికి… తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కృషితో జీతాల సమస్య పరిష్కారమైంది. దీంతో రుయా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది కృతజ్ఞతా పూర్వకంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని, తన వంతు సహాయ సహకారాలను అందించిన నగర మేయర్ భూమన అభినయ్ రెడ్డి, రుయా అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ ని కలిశారు. ఈ మేరకు పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద గురువారం ఉదయం పుష్ప గుచ్చాలు సమర్పించి, దుశ్శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా రుయా సెక్యూరిటీ సిబ్బంది మాట్లాడుతూ…ఆపద సమయంలో తమకు అండగా నిలుస్తున్న భూమన కుటుంబానికి తాము ఎల్లవేళలా రుణపడి ఉంటామని ప్రకటించారు. సుమారు 12 నెలల నుంచి జీతాలు అందక ఇబ్బంది పడ్డామని…
ఈ నేపథ్యంలో తమ సమస్యను
భూమన కరుణాకర రెడ్డికి తీసుకొచ్చామని, దీంతో ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. చొరవ తీసుకుని తమ సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి తీసుకొచ్చి పరిష్కరించారన్నారు. ప్రస్తుతానికి 7 నెలల జీతాలు అందాయని, మిగిలిన జీతాన్ని ఇప్పించేలా కరుణాకర రెడ్డి, అభినయ్ కృషి చేస్తామని హమీ ఇచ్చారన్నారు. తమకు సహాయ సహకారాలను అందించిన రుయా అభివృద్ధి వర్కింగ్ కమిటీ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలియజేశామన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మురళి, విశ్వనాథ్,రాధాకృష్ణ, రవి, శివ పాల్గొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Salaries received by Rua Hospital Security Staff on Earth initiative

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page