ఈనెల 25న తెరాస జనరల్ బాడీ భేటీ-వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

0 7,905

హైదరాబాద్ ముచ్చట్లు:

ఈ నెల 25న హైటెక్స్లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గత 20 సంవత్సరాలు గా టిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోని ,ఎన్నో విజయాలు సాదించింది. దేశ చరిత్ర లోనే గుర్తుండుపోయేలా తెలంగాణ ఉధ్యమం నడిపించామని కేటీఆర్ అన్నారు. స్వియ అస్థిత్వమే శ్రీరామ రక్ష అని ..కేసీఆర్ కు పట్టం కట్టారు. రెండు సార్లు మాకు అధికారం ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా ఎన్నో విజయాలు సాదించాం. మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ప్రజలు తెలంగాణ లో కలుస్తామని అక్కడి ప్రభంత్వాన్ని అడుగుతున్నారు. మరోవైపు కర్ణాటక రాయచూర్ ప్రజలు కూడా తెలంగాణ లో కలుస్తామంటుంన్నారు. భారత ప్రభుత్వానికి తెలంగాణ పథకాలు ఆదర్శమవుతున్నాయి.  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతుంది. అర్బన్ ఫారెస్ట్ ను తెలంగాణ లో ఎలా అభివృద్ధి చేస్తున్నారు  అని చూడడానికి కేంద్ర ప్రతినిధులు వచ్చారు. తెలంగాణ అభివృద్ధి ని భారతదేశం ఆచరించక తప్పదనే పరిస్థితి వచ్చింది. ప్లీనరీ , మా పార్టీ  అధ్యక్షుడి ఎన్నిక మాకు అత్యంత కీలకమైనవి.  నాలుగు వేల వాహనాలు వచ్చే అవకాశం ఉంది.. ఇబ్బంది కాకుండా పార్కింగ్ స్థలాలు గుర్తించామని అన్నారు. దసరా తర్వాత సభా ప్రాంగణానికి నామకరణం చేస్తాం. ఆహ్వానం అందిన వారు మాత్రమే సభకు రావాలని సూచించారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Teresa General Body Meeting-Working President KTR on the 25th of this month

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page