విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి -అయ్యన్న పాత్రుడు

0 9,263

విశాఖపట్నం ముచ్చట్లు:

 

రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు.అనుభవం లేని వ్యక్తిని, ఆర్దిక నేరస్తుడిని ముఖ్యమంత్రిని చేస్తే పరిపాలన ఏ విధంగా ఉంటుందో అర్ధమవుతోందని అన్నారు.విశాఖ జిల్లా నర్శీపట్నంలో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు ధర 3 రూపాయల పన్నెండు పైసలు ఉంటే, జగన్ రెడ్డి మాత్రం తన కమీషన్ల కోసం 6 రూపాయల నుండి 11 రూపాయల వరకు కొనుగోలు చేసి ఆ భారాన్ని మళ్ళి ప్రజలపైనే వేస్తున్నారని అన్నారు.తాను ముఖ్యమంత్రి అయితే 200 యూనిట్లు వరకు కరెంట్ ఉచితంగా ఇస్తానని చెప్పిన హామీని విస్మరించారని ఆరోపించారు.విద్యుత్ చార్జీలు పెంచనని ప్రచారం చేసుకొని తీరా గెలిచాక ఈ రెండున్నర సంవత్సరాలలో సుమారు 37 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని అన్నారు.ట్రూఅప్ ఛార్జీలు నిలుపుదల చేయడం కాదు, పూర్తిగా రద్దు చేయాలని,వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే చర్యలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: The power woes began — he deserved it

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page