రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ

0 7,581

పిఠాపురం  ముచ్చట్లు:

పిఠాపురం పట్టణం సాలిపేటలో బీ.ఎస్.ఎన్.ఎల్.రిటైర్డ్ ఉద్యోగి కాకి సత్యనారాయణ ఇంట్లో బుధవారం రాత్రి దొంగలుపడి,లక్షాయాభైవేల రూపాయల నగదు,పది కాసుల బంగారు ఆభరణాలు,విలువైన పట్టుచీరలు దోచుకునిపోయారు.కాకి సత్యనారాయణ నెలరోజులక్రితం ఇంటికి తాళాలువేసి,ఊరు వెళ్ళారు.అయితే.,గురువారం ఉదయం ఆ ఇంటి తలుపులు తీసిఉన్నట్టు గమనించిన ప్రక్కింటివారు సత్యనారాయణకు ఫోన్ చేసి తెలిపారు.వచ్చి చూడగా.,బీరువా తలుపులు తెరిచుండడం,బట్టలు, వస్తువులు చెల్లాచెదురుగా పడుండడం చూసి,వెంటనే పోలీసులకు తెలిపారు.లక్షాయాభైవేల రూపాయల నగదు, పదికాసుల బంగారు ఆభరణాలు,విలువైన పట్టుచీరలు చోరీకి గురైనట్లు బాధితులు సత్యనారాయణ దంపతులు మీడియాకు తెలిపారు.సీఐ వైఆర్కే.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ ఎస్సై అబ్దుల్ నబీ కేసు నమోదుచేసి,దర్యాప్తు ప్రారంభించగా,క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరించారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Theft at the home of a retired employee

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page