జిల్లా ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు

0 8,252

చిత్తూరు ముచ్చట్లు:

జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ విజయ దశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలనిఆకాంక్షించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడరాదని సూచించారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రజలంతా ఆనందంగా విజయదశమి పండుగజరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.అదేవిధంగా కుంటలు ,చెరువులు,వాగులు వంకలు ప్రమాద స్థాయికి మించి కొన్ని ప్రాంతాల్లో ప్రవహిస్తున్నాయని అందరూ జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా సెలవులలో ఉండాలనికలెక్టర్ తెలిపారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Vijayadashami wishes to the people of the district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page