తెలంగాణ కాంగ్రెస్‌ తో పొత్తు

0 5,878

-తలో మాట చెబుతున్న తమ్ముళ్లు

హైదరాబాద్   ముచ్చట్లు:

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పుడిప్పుడే కొంత బలం పెంచుకుంటోంది. అన్ని పార్టీలను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టాలని భావిస్తుంది. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ తమకు ఏమాత్రం పోటీ కాదని, ఆ పార్టీని ప్రజలు నమ్మరని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాత్రం కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద కుండ బద్దలు కొట్టారు. కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోకపోవడమే మంచిదని వారు సూచించారు.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత విపక్షాలన్నింటినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. కోదండరామ్, వామపక్ష పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. పలుమార్లు అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. దీనిపై పెద్దగా అభ్యంతరాలు ఎవరూ చేయలేదు. అయితే టీడీపీతో పొత్తు పై మాత్రం అనేక మంది సీనియర్ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగి భంగపడింది. టీడీపీ వల్ల పార్టీకి ఏమీ కలసి రాకపోగా తీవ్ర నష్టమే జరిగింది. కేసీఆర్ కు చంద్రబాబు అస్త్రం చేతికిచ్చినట్లయింది. ఆంధ్రా వాళ్ల పెత్తనం మళ్లీ మొదలయిందని కేసీఆర్ నాడు ఎన్నికల్లో చేసిన ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. నాడు టీడీపీతో పొత్తు కారణంగానే అనేక నియోజకవర్గాల్లో నష్టపోయామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే తప్పుపట్టారు.ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరోసారి రేవంత్ రెడ్డి టీడీపీని కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ విపక్షాలతో కలసి చేసిన ధర్నాలో టీడీపీ పాల్గొనడం చర్చనీయాంశమైంది. తెలంగాణ టీడీపీ నేతలు ఈ ధర్నాలో పాల్గొనడటంతో మరోసారి టీడీపీతో కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీతో కలసి పోటీ చేయడంపై సీనియర్ నేతలు అనేక మంది అభ్యంతరం చెబుతున్నారు. మరోసారి కేసీఆర్ కు ఆ అవకాశం ఇవ్వకూడదని చెబుతున్నారు. బహుశ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశముంది. అయితే ఏపీలో కుదిరే పొత్తులను బట్టి ఇక్కడ అలయన్స్ సెట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Alliance with Telangana Congress

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page