బ్రిట‌న్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హ‌త్య‌

0 7,589

ఇంగ్లండ్ ముచ్చట్లు:

బ్రిట‌న్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. పౌరుల‌తో క‌లిసి వారాంత‌పు స‌మావేశంలో పాల్గొనేందుకు అమీస్ చ‌ర్చికి వ‌చ్చారు. స్థానిక లీ-ఆన్-సీలోని చ‌ర్చిలో డేవిడ్ అమీస్ ప్రార్థ‌న‌లు చేస్తుండ‌గా గుర్తు తెలియ‌ని దుండ‌గులు క‌త్తితో దాడి చేశారు. దీంతో ఎంపీకి తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ బ్రిట‌న్ ఎంపీ తుదిశ్వాస విడిచారు. ఈ హ‌త్య కేసులో ఒక‌రిని అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఎసెక్స్‌లోని సౌంత్ ఎండ్ వెస్ట్ నుంచి డేవిడ్ అమీస్ పార్ల‌మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. బ్రిట‌న్ ప్ర‌ధాని జాన్స‌న్‌కు చెందిన క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నేత డేవిడ్ అమీస్. 1983 నుంచి బ్రిట‌న్ ఎంపీగా కొన‌సాగుతున్నారు. డేవిడ్ అమీస్ హ‌త్య‌ను ఉగ్ర‌వాద చ‌ర్య‌గా బ్రిట‌న్ పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:British MP David Amis brutally murdered

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page