మళ్లీ పడిపోయిన మిర్చి

0 7,868

గుంటూరు   ముచ్చట్లు:

సీజన్‌లో ధరలు తక్కువగా రావడంతో కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేసుకుంటే అన్‌సీజన్‌లో ధరలు బాగా వస్తాయని ఆశపడిన మిర్చి రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. గత మూడేళ్ల కాలంలో ఏటా ఆగస్టు నుంచి నవంబరు మధ్యలో మిర్చికి అధిక ధరలు వస్తున్నాయి. ఈ ఏడాది సీజన్‌లో వచ్చిన ధరలే అన్‌సీజన్‌లో కూడా వస్తుండడంతో అనేక వ్యయప్రయాసలకు కోర్చి కోల్డ్‌ స్టోరేజీలో ఎందుకు నిల్వ చేసుకున్నామా? అని రైతులు ఆవేదన చెందుతున్నారు. గుంటూరు మిర్చి యార్డు కేంద్రంగా ఏటా రూ.6 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. సీజన్‌లో రోజుకు లక్ష నుంచి రెండు లక్షల టిక్కిలు యార్డుకు వస్తాయి. ఫిబ్రవరి నుంచి మే చివరి వరకు సీజన్‌గా పరిగణిస్తారు. ఒకేసారి ఎక్కువ సరుకు రావడం వల్ల వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది, దీంతో రైతులు తమ సరుకును కొద్ది నెలల తరువాత విక్రయించుకునేలా ప్లాన్‌ చేసుకుని కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేసుకుంటారు. గుంటూరు పరిసరాల్లో దాదాపు 132 కోల్డ్‌ స్టోరేజీల్లో దాదాపు కోటి టిక్కిలు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. గత మూడేళ్లుగా ఏటా సీజన్‌లో క్వింటాలు సగటు ధర కనిష్టంగా రూ.9 వేలు, గరిష్టంగా రూ.13 వేలు వరకు లభించేది. ఈ ఏడాది కొంత మేరకు ధర తగ్గింది. కనిష్ట ధర రూ.8 వేలు, గరిష్ట ధర రూ.12 వేలు మాత్రమే లభించింది. అన్‌సీజన్‌లో కనిష్ట ధర రూ.12 వేలు, గరిష్ట ధర రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు పలికేది. ఈ ఏడాది సీజన్‌లో వచ్చిన ధరలే అన్‌ సీజన్‌లోనూ రావడం రైతులను నిరాశ పరుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ నెల పదో తేదీ వరకూ లభించిన ధరలను పరిశీలిస్తే కనిష్ట సగటు ధర రూ.9 వేలు, గరిష్ట సగటు ధర రూ.12 వేలు మించలేదు. గత రెండు నెలలుగా యార్డుకు నిత్యం 35 వేల నుంచి 45 వేల టిక్కిలు వస్తున్నాయి. దాదాపు ఐదు నెలల పాటు కోల్డ్‌ స్టోరేజీలో ఉంచినా ఆశించిన స్థాయిలో ధరలు పెరగడంలేదని రైతులు వాపోతున్నారు. కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ ఉంచినందుకు టిక్కికి రూ.500 నిర్వాహకులకు ఫీజు చెల్లించాలి. ఈ ఏడాది నాన్‌ ఎసి ధర కన్నా ఎసి వెరయిటీ ధర పెద్దగా పెరగలేదని రైతులు చెబుతున్నారు. మిర్చిలో అత్యంత నాణ్యత కలిగిన తేజ, బాడుగ రకం ధర కూడా గరిష్టంగా రూ.13 వేలు మించడం లేదు. ఈ రెండు వెరైటీలకు అన్‌సీజన్‌లో క్వింటాలుకు గరిష్ట ధర రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు వస్తుందని ఆశించారు. జిల్లాలోని కోల్డ్‌ స్టోరేజీల్లో ఇంకా 25 లక్షల టిక్కిలు నిల్వ ఉన్నట్టు అంచనా. డిసెంబరు 15లోగా ఈ నిల్వలన్నీ విక్రయించాల్సి ఉంది. డిసెంబరు చివరి వారం నుంచి తిరిగి కొత్త సీజన్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుత సీజన్‌లో పంటలకు పెట్టుబడులు అవసరం ఉండడంతో కోల్డ్‌ స్టోరేజీల్లోని మిర్చిని విక్రయించకతప్పని పరిస్థితి రైతులకు నెలకొంది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Fallen pepper again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page