అందరి వాడుగా ఉండేందుకు జనసేనాని ప్రయత్నాలు

0 7,579

కాకినాడ ముచ్చట్లు:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని ఆయన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. క్యాడర్ లో భరోసా నింపేందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకున్నా, ఆయన ప్రయత్నాలు కూడా ఆ దిశగానే సాగుతున్నాయి. జనసేనలో అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీపై పడిన కుల ముద్రను తొలగించుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.2019లో జరిగిన ఎన్నికల్లోనూ సామాజికవర్గాల నుంచి మద్దతు లేకపోవడంతోనే తాను ఓటమి చెందానని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. భీమవరంలో ఓటమికి తన చెంత రాజుల సామాజికవర్గం నేతలు లేకపోవడమేనని గ్రహించారు. దీంతో రాజులతో పాటు మిగిలిన సామాజికవర్గాల వారిని పార్టీలోకి తీసుకుని వారికి పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజును పార్టీలోకి తీసుకోవాలనుకుంటున్నారు.ఆయన పార్టీలోకి వస్తే మరికొందరు అదే సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా పార్టీలో చేరతారని భావిస్తున్నారు. విష్ణుకుమార్ రాజుతో ఇప్పటికే కొందరు జనసేన నేతలు టచ్ లో ఉన్నారని తెలిసింది. ఆయన కు విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి ఆయన 2014లో గెలిచారు. బీజేపీ శాసనసభ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. ఆయన చేరికతో ఉత్తరాంధ్రతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పార్టీ బలోపేతం అవుతుందన్న అంచనాలో పవన్ కల్యాణ‌్ ఉన్నారు.ఇక ఆయనతో పాటు మరికొందరు ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కూడా జనసేనలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే వీరందిరినీ దసరా తర్వాత పార్టీలో చేర్చుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. అన్ని కులాల వారికి జనసేనలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పేందుకు త్వరలో జనసేనలో చేరికలు భారీగా ఉంటాయంటున్నారు. అయితే ఎక్కువగా టీడీపీ, బీజేపీల నుంచే ఈ వలసలు ఉండనున్నాయి.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags;Janasena’s efforts to be of use to all

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page