కాలుష్య నది కాదు.. కాసులు పండించే నది..

0 75,798

హైదరాబాద్ ముచ్చట్లు:

బంగారు తెలంగాణ నినాదంలోనే కాదు.. ఈనేలలోనే బంగారం దాగిఉందా? డర్టీ రివర్ గా ప్రవహిస్తున్న మూసీలో డైమండ్స్ నిక్షేపాలు ఒదిగి ఉన్నాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు నిపుణులు. అవును.. తెలంగాణ నేలలో అనేక చోట్ల బంగారుచోట్ల బంగారు, వజ్ర నిక్షేపాలు ఉన్నాయని జిఎస్ఐ, ఉస్మానియా పరిశోధనలు తేల్చిచెబుతున్నాయి. అయితే మరిన్ని లోతైన పరిశోధనలు అవసరమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ.. దక్కన్‌ పీఠభూమిలో బంగారు గనులు ఎక్కడ దాగి ఉన్నాయి? డైమండ్‌ నిక్షేపాలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఈ కథనంలో తెలుసుకుందాం..తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డే కాదు.. బంగారు నేల. వజ్ర వైఢుర్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఈ మాట అంటున్నది సాహితీ వేత్తలు కాదు.. శాస్త్రవేత్తలు. అవును తెలంగాణ నేలలో అనేక ప్రాంతాల్లో బంగారం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. డైమండ్‌ శిలలు బహిర్గతమవుతున్నాయి. జిఎస్ఐ.. జియెలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఉస్మానియా విశ్వవిద్యాలయం జియో ఫిజిక్స్ విభాగాలు చేసిన పరిశోధనల్లో గోల్డ్, డైమండ్‌ నిక్షేపాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలుగా ఉన్న బంగారు గడ్డ, చౌటుప్పల్‌, గద్వాల్ జోగులాంబ జిల్లాలోని గద్వాల్, మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని మక్తల్, నల్గొండ జిల్లాలోని పెదవూర, హాల్యా ప్రాంతాల్లో బంగారు ఆనవాళ్లు వెలికితీశారు శాస్త్రవేత్తలు. మరో వైపు డైమండ్‌ నిక్షేపాలు కూడా మహబూబ్‌ నగర్‌ జిల్లా నారాయణపేట్‌, కోటకొండ, రామడుగు, మిర్యాలగూడ ప్రాంతాల్లో బహిర్గతం అయ్యాయి. చివరికి మనం కాలుష్య నదిలా ఉన్న మూసీలో సైతం వజ్రాల గనుల ఆనవాళ్లు బయటపడ్డాయి.

- Advertisement -

దేశంలో ఒక ప్రధానమైన కారిడార్‌ లో బంగారం, డైమండ్‌, విలువైన ఖనిజాల అన్వేషణ కోసం కేంద్రం ప్రభుత్వం ఒక పరిశోధన చేయించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జిఎస్‌ఐ, ఉస్మానియా వర్సిటీ శాస్త్రవేత్తలు బృందం అనేక ప్రాంతాల్లో పరిశోధన సాగించింది. ఇందులో బంగారం ఉండే ఖనిజ రాళ్లతో పాటు.. డైమండ్‌ కు సంబంధించిన ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. ఈ పరిశోధనల్లో ఎక్కడ బంగారం లభించే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ డైమండ్‌ కు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయనేది గుర్తించామంటున్నారు. ఈ పరిశోధనలో కీలకబాధ్యతలు నిర్వహించారు ఉస్మానియా విశ్వవిద్యాలయం జియో ఫిజిక్స్ మాజీ హెచ్‌వోడీ, ప్రొఫెసర్‌ రాందాస్. ‘‘ ఈపరిశోధనల్లో చాలా చోట్ల బంగారం గనుల ఆనవాళ్లు పుష్కలంగా బయటపడ్డాయి. నల్గొండ జిల్లా పెద ఊర, హాల్యా లాంటి ప్రాంతాల్లో ఆశాజనకంగా బంగారు నిక్షేపాల ఆనవాళ్లు వెల్లడయ్యాయి. మిర్యాలగూడ, వాడపల్లి ప్రాంతాల్లో డైమండ్‌ కు సంబంధించిన పరిశోధనల్లో మంచి రిజల్ట్స్ వచ్చింది.’’ అని ప్రొఫెసర్ రాందాస్ తెలిపారుగోల్డ్, డైమండ్.. నిక్షేపాలు కనుగొనడానికి అతి పెద్ద సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగించాలి. బంగారం గనులు ఉన్నాయని గుర్తించడానికి సిస్ట్ రాక్‌ బెల్ట్ ఉండాలి. అదే డైమండ్‌ ఉందని తెలుసుకోడానికి కింబర్‌ లైన్‌ అనే రాక్‌ అనవాళ్లు కనిపించాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి అనావాళ్లు ఉన్న ప్రాంతాల్లో చేసిన పరిశోధనలే.. తెలంగాణలో బంగారు, డైమండ్‌ నిక్షేపాలు ఉన్నాయని తేల్చాయంటున్నారు.ఇకపోతే.. మూసీ ఈపేరు చెబితే కళ్ల ముందు కాలుష్యం కన్పిస్తుంది. కానీ మూసీ మురికి నీటి ప్రమాహం లోతుల్లో డైమండ్స్ ఉన్నాయా? అంటే అవుననే అంటున్నాయి శాస్త్రవేత్తల పరిశోధనలు. కొన్ని ప్రయోగాలు ఎంత లోతైన విషయాలు బయటపెడతాయంటే.. ఇప్పటి వరకూ మనకున్న అభిప్రాయాలను సైతం మార్చేస్తాయి. మూసి విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. మురికి కూపంగా ఉన్న మూసీ నదిలో సైతం డైమండ్స్‌ ఆనవాళ్లు బయటపడ్డాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక దిశగా వెళుతున్న మూసీ ఒక్కసారిగా తన గమ్యాన్ని మార్చుకుని కృష్ణానదిలో కలసిన గమనం కూడా అనేక పరిశోధనలకు కారణమైందంటున్నారు. భూమిలో ఉండే అతి పెద్ద మార్పులే.. నదుల నడకను ఇలా మార్చే అవకాశం ఉందంటున్నారు. అందుకే మూసీ నది.. తన చివరి గమ్యంగా కృష్ణనదిలో కలిసే వాడపల్లి వద్ద మూసీలో డైమండ్‌ నిక్షేపాలు చాలానే ఉన్నాయంటున్నారు. నిజంగా మూసీపై మరింత పరిశోధన సాగి. డైమండ్‌ నిల్వలు అనుకున్న స్థాయిలో బయటపడితే.. ఈ కాలుష్య నది కాసులు పండించే నదిగా మారిపోయే అవకాశాలున్నాయి.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Not a river of pollution .. a river of cassava ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page