పూరి మార్క్ తో రొమాంటిక్  చిత్రం

0 9,867

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ప్రేమ, యాక్షన్ కథాంశం తో నిర్మితమైన రొమాంటిక్ చిత్రం తన తండ్రి పూరి జగన్నాధ్ మార్క్ తో కూడింది అని చిత్ర హీరో ఆకాశ్ అన్నారు. రొమాంటిక్ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమం నగరంలో ఫోర్ పాయింట్ హొటల్ లో జరిగింది. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో  చిత్ర హీరో ఆకాశ్ మాట్లాడుతూ రొమాంటిక్ చిత్రానికి తన తండ్రి కథ, స్క్రీన్ ప్లే అందించగ అనిల్ పోడూరి దర్శకత్వం వహించారు అన్నారు. నటి రమ్యకృష్ణ మంచి పవర్ ఫుల్ పాత్ర చేశారని తమ సినిమా కు అది ఎసెర్ట్ గా నిలుస్తుంది అన్నారు. హీరోయిన్ కెటికా శర్మ తొలి సినిమా లోనే ఎంతో బాగా నటించారు అన్నారు.  గౌవా లో షూటింగ్ చేశామని చెప్పారు. తనకు రజనికాంత్, అనుష్క అంటే ఇష్టం అన్నారు. దర్శకుల్లో తన తండ్రి పూరి, తర్వాత రాజమౌళి ఇష్టం అన్నారు. చిత్ర దర్శకుడు అనిల్ పోడూరి మాట్లాడుతూ తాను పలు చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగం లో పని చేశాం అన్నారు. కథ, స్క్రీన్ ప్లే సిద్దం చేసుకొని పూరి ఈ చిత్రం ద్వారా తనకు దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు అన్నారు.  పూరి జగన్నాథ్, చార్మి నిర్మాత లుగా వ్యవహరించారు అన్నారు. హీరో ఆకాశ్ ప్రతి సన్నివేశం ఎంతో బాగా నటించారు. సునీల్ కాశ్యప్ సంగీతం అందించారు.  చిత్రం అత్యద్భుతంగా వచ్చింది. నవంబర్ 4న చిత్రం విడుదల చేస్తామని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు. పాటల రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ రొమాంటిక్ మూవీ లో అన్ని పాటలు బాగున్నాయి. టీజర్, పాటలకు విశేష స్పందన వచ్చింది అన్నారు. రొమాంటిక్ చిత్రం ను విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Romantic film with Puri Mark

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page