పిడుగు పాటు  బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి-మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి

0 8,820

-మృతురాలి కుటుంబీకులకు తక్షణ సాయం అందించాలి.
-మృతురాలి కుటుంబీకులను పరామర్శించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి.

పలమనేరు ముచ్చట్లు:

- Advertisement -

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ పరిధిలోని బోడి రెడ్డి పల్లి కాలనీకి చెందిన మంజునాథ్ భార్య నేత్రావతి పిడుగుపాటుతో శుక్ర వారం మృతి చెందింది. దీంతో అధికారులు  పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అమర్నాథరెడ్డి  శనివారం ఉదయం  స్థానిక టిడిపి నాయకులతో కలిసి  ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని  మృతురాలి కుటుంబ సభ్యులను  పరామర్శించారు.  పిడుగు పాటు బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మృతురాలు నేత్రావతి కుటుంబీకులకు తక్షణ సాయం అందించి ప్రభుత్వం అండగా నిలవాలని  ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:The government should support the victims along with the lightning – Former Minister Amarnath Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page