త్రిష, సూర్య వంగల, అవినాష్ కొల్ల, సోని లివ్ వెబ్ సిరీస్ ‘బృందా’ లాంఛనంగా ప్రారంభం

0 7,586

సినిమాముచట్లు:

ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లకు టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. తన ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. అవినాష్ కొల్ల ఇప్పుడు తన సోదరుడు అశోక్ కొల్లతో కలిసి కొత్త ప్రొడక్షన్ కంపెనీ అండ్ స్టోరీస్ (&Stories)ను ప్రారంభించారు.సోనీ లివ్ ఓటీటీ ఫ్లాట్ ఫాంతో కలిసి తమ మొదటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. త్రిష హీరోయిన్‌గా బృందా అనే టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతోన్నారు. త్రిష కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సరైన కథ కోసం వేచి చూస్తున్నారు. తనకు నచ్చిన స్క్రిప్ట్ దొరకడంతో ఇలా ఓటీటీ బాట పట్టేశారు. దసరా సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలను నేడు నిర్వహించారు. సోనీ లివ్ మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వెబ్ సిరీస్‌ను చేస్తోంది. అది కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రాబోతోన్న అద్భుతమైన కథతో సోనీ లివ్ రాబోతోంది. సూర్య వంగల ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. శక్తికాంత్ కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. దినేష్ కే బాబు కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. జై కృష్ణ ఈ వెబ్ సిరీస్‌కు మాటలు అందిస్తున్నారు. పద్మావతి మల్లాదితో కలిసి సూర్య వంగల స్క్రీన్ ప్లే రాసుకున్నారు. శశాంక్ వెన్నెలకంటి స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు.సాయి కుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవింద్ర విజయ్, ఆనంద్ సామి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు. నటీనటులు : త్రిష, సాయి కుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవింద్ర విజయ్, ఆనంద్ సామి తదితరులు

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Trisha, Surya Vangala, Avinash Kolla, Sony Live web series ‘Brinda’ formally launched

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page