బన్నీ ఉత్సవం లో చెలరేగిన హింస

0 7,581

హొళగుంద   ముచ్చట్లు:

కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ఉత్సవంలో చెలరేగిన హింసలో సుమారు వంద మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Violence erupted during the Bunny Festival

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page