అక్టోబరు 18 నుండి 20వ తేదీ వరకు శ్రీ‌వారి మెట్టు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో అష్ట‌బంధ‌న మహా సంప్రోక్షణ

0 9,923

తిరుపతి ముచ్చట్లు:

 

శ్రీ‌నివాస‌మంగాపురం స‌మీపంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద గ‌ల శ్రీ వేంటేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ అక్టోబరు 18 నుండి 20వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అక్టోబరు 18వ తేదీ సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు ఆచార్య రుత్విక్ వ‌ర‌ణం, అక‌ల్మ‌ష‌హోమం, సాయంత్రం 6.30 గంట‌ల వ‌ర‌కు అంకురార్పణం జరుగనుంది.ఇందులో భాగంగా అక్టోబరు 19వ తేదీ ఉదయం 9 గంట‌ల‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, సాయంత్రం 6 గంటలకు విశేష హోమాలు, అష్ట‌బంధ‌నం నిర్వ‌హిస్తారు.అక్టోబ‌రు 20వ తేదీ ఉద‌యం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి అభిషేకం, హోమాలు, పూర్ణాహూతి, అవాహ‌న అర్చ‌న నిర్వ‌హిస్తారు. ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌హా సంప్రొక్ష‌ణ‌ జ‌రుగుతుంది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Ashtabandhana Maha Samprokshan at Sri Venkateswaraswamy Temple, Srivari Mettu from 18th to 20th October

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page