కేరళలో కుంభవృష్టి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

0 9,845

-వరద కారక ప్రమాదాల్లో ఆరుగురి మృతి

-12 మంది గల్లంతు

- Advertisement -

-అరేబియా సముద్రతీరంలో అల్పపీడన ప్రభావం

-సహాయక చర్యల్లో త్రివిధ దళాలు

-కేరళలో కుంభవృష్టి

 

తిరువనంతపురం ముచ్చట్లు:

 

 

కేరళలో వర్షాలు భీభత్సంగా కుమ్మేస్తున్నాయి. పథనంతిట్ట, కొట్టాయంలతో పాటు… ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశ్శూర్‌, పాలక్కాడ్‌ జిల్లాల్లోనూ శనివారం అతి భారీ స్థాయిలో కురిశాయి. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతిచెందారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. త్రివిధ దళాల సిబ్బంది, జాతీయ విపత్తుల స్పందనా దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Avalanche in Kerala Heavy rains in many districts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page