అక్టోబ‌రు 18న వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్ప‌ణ‌

0 9,294

తిరుపతి ముచ్చట్లు:

 

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 19 నుండి 21వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలకు అక్టోబరు 18వ తేదీ 5 గంటలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహించ‌నున్నారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాలు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.ఇందులో భాగంగా అక్టోబరు 19వ తేదీ ఉదయం 7 గంటలకు యాగశాల పూజ, చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ఠ, ఉద‌యం 10.30 గంట‌ల‌కు శ్రీ పట్టాభిరామస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబరు 20న ఉదయం 7 గంట‌ల‌కు చతుష్టానార్చన, మూర్తి హోమం, పవిత్రసమర్పణ, జ‌రుగ‌నుంది. అక్టోబరు 21న ఉదయం 7 గంట‌ల‌కు చతుష్టానార్చన, మూర్తి హోమం, మ‌హా పూర్ణాహూతి, పవిత్ర వితరణ, అభిషేకం, చ‌క్ర‌స్నానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Inauguration of Valmikipuram Sri Pattabhiramaswamy’s holy festival on 18th October

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page