ఫేస్‌బుక్‌ లో యువతికి పరిచయం.. 9 లక్షల నగదు, 192 గ్రాముల బంగారు నగలు తీసుకొని..!

0 9,691

-ఓ యువతికి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ టోపీ

-ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం

- Advertisement -

-192గ్రాముల నగలు, రూ.9.33 లక్షలు కాజేశాడు

తిరుపతి ముచ్చట్లు:

 

 

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫ్రెండ్‌ చేతిలో తిరుపతికి చెందిన ఓ యువతి మోసపోయారు. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. టీటీడీకి చెందిన ఓ ఇంజనీర్‌ కుమార్తెకు అనంతపురానికి చెందిన దీపాబాబు అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నిత్యం ఆమెతో చాట్‌చేస్తూ వచ్చిన అతను అనంతపురం కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకోసం కొంత ఖర్చు పెట్టాలంటూ.. విడతలవారీగా రూ.9.33 లక్షలతోపాటు 192 గ్రాముల బంగారు నగలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎటువంటి స్పందన లేదు. పైగా ఫేస్‌బుక్‌లోనూ కనిపించకుండా పోయాడు. మోసం చేశాడని ఆలస్యంగా గుర్తించిన ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. యువతి తండ్రి శనివారం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Introduction to a young woman on Facebook .. Taking 9 lakh cash and 192 grams of gold jewelery ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page