వాల్మీకి జయంతినీ జయప్రదం చేయండి

0 9,044

డోన్ ముచ్చట్లు:

 

వాల్మీకి జయంతినీ ఘనంగా జయప్రదం చేయాలనీ డోన్ వాల్మీకి సంగమ్ నాయకులు పిలుపు ఇచ్చారు, స్థానిక డోన్ పట్టణంలో  వాల్మీకి సంగమ్ నాయకులు భాస్కర్ నాయుడు, వలసల రామకృష్ణ నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూఈ నెల 20 వ తేదీన జరగబోయే వాల్మీకి జయంతినీ వాల్మీకులు అందరు ఐకమత్యంగా కలిసి జయప్రదం చేయాలని పట్టణానికి చెందిన వాల్మీకి నాయకులు పిలుపునిచ్చారు. వాల్మీకి జయంతిని ఉద్దేశించి వాల్మీకి నాయకులైన భాస్కర్ నాయుడు, వలసలరామకృష్ణ లు మాట్లాడుతూ ఎంతో వెనుకబడిన బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని  అలాగే వాల్మీకి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పండుగగా గుర్తించడం అభినందనీయం అన్నారు. వాల్మీకులను చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వాల్మీకి జయంతి జరుపుకోవడం జరుగుతుందని .ఈ పండుగకు ప్రతి ఒక్క వాల్మీకి కుటుంబ సభ్యులతో కలిసి  పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ రామయ్య, పోస్ట్ ప్రసాద్, కౌన్సిలర్లు ఆర్ట్స్ రమణ, మేకల నాగరాజు, సుంకన్న, మహేంద్ర నాయుడు ఇతర వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Celebrate Valmiki Jayanti

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page