మనోహరాబాద్ తెరాసలో వర్గ విభేదాలు

0 9,662

మెదక్ ముచ్చట్లు:

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గమైన మనోహరబాద్ మండలంలో టిఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.  పార్టీ మండల పార్టీ  ప్రసిడెంట్ పై వ్యతిరేకత వ్యక్తమయింది.   గ్రామాలలో అధ్యక్షులను ఎన్నుకున్నాక,  మరొక్కరిని అయన  నియమిస్తునట్లు విమర్శలు వచ్చాయి.  ఈ నేపధ్యంలో పార్టీ శ్రేణుల గ్రూపులుగా విడిపోయి టెంట్ వేసి మరీ నిరసనకు దిగాయి. ఓ వర్గం టిఆర్ఎస్ నాయకులు,  కార్యకర్తలు తమకు పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
టిఆర్ఎస్ పార్టీ మండల, గ్రామ ఎన్నికలలో రెండేసి కమిటీలు అధ్యక్ష,  కార్యదర్శులను ఎవరికి వారుగా ఎన్నుకోవడంతో వివాదం వచ్చింది. మండల అధ్యక్షుడి కి వ్యతిరేకంగా రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం అధ్యకుడు మైపాల్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో తూప్రాన్ సొసైటీ చైర్మన్ బాల కృష్ణ రెడ్డి  కళ్లకల్ ఎంపీటీసీ నత్తి లావణ్య  పెంట గౌడ్  శేఖర్ సర్పంచ్ లు  కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Class differences in Manoharabad Terasa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page