కరెంటు పరిస్థితులపై సీఎం సమీక్ష

0 9,866

అమరావతి ముచ్చట్లు:

 

రాష్ట్రంలోకరెంటు పరిస్థితులపై అధికారులతో సీఎం  వైయస్.జగన్ సమీక్ష జరిపారు. ఈ భేటీకి ఇంధన శాఖకార్యదర్శి ఎన్.శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీధర్సహా పలువురు అధికారులు హాజరు అయ్యారు.  బొగ్గు సరఫరా, విద్యుత్ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపైనా నిశితంగా సమీక్ష జరిపారు.  ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరంగా కరెంటును సరఫరాచేస్తున్నాం. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని ఆమేరకు తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నాం.  మహానది కోల్ఫీల్డ్స్ నుంచి 2 ర్యాకులు బొగ్గు అదనంగా వచ్చింది.  రాష్ట్రంలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్విద్యుత్ ఉత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని అధికారులు తెలిపారు.  థర్మల్విద్యుత్కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. – సింగరేణి సహా కోల్ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలి.  బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పుల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపైకూడా ఆలోచనలు చేయాలి.  దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి.  దీనికోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు.  పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు అన్నారు.  కావాల్సిన విద్యుత్ను సమీకరించుకోవాలి.  తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలి.  6300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుత్ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలి.  ఈప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: CM review on current conditions

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page