టాస్క్ ఫోర్స్ సిబ్బందికి డిఐజి దిశానిర్దేశం

0 9,264

తిరుపతి ముచ్చట్లు:

 

టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా సోమవారం దిశానిర్దేశం చేశారు. ఆయన టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు. శేషాచలం అడవిలోని ఎర్రచందనం వృక్షాలు కలిగి ఉన్న ప్రాంతాలను మ్యాప్ ల ద్వారా గుర్తించారు. స్మగ్లర్లు ఆ ప్రాంతాలకు చేరుకునే మార్గాల వద్ద నిఘా ఏర్పాటుకు సంబంధించిన సూచనలు చేశారు. ఇతర జిల్లాల పోలీసు విభాగాల సహకారంతో ఇది వరకే చేపట్టిన ఆపరేషన్ ల ఫలితాలు గురించి సమీక్షించారు. అడవుల్లో చేపట్టాల్సిన భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, డీస్పీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; DIG direction for task force personnel

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page