కాణిపాకం ఆలయ మహిళా ఉద్యోగి వినూత్న నిరసన

0 9,676

కాణిపాకం ముచ్చట్లు:

 

కాణిపాకం దేవస్థానం ఈవో వైఖరికి నిరసనగా ఓ మహిళా ఉద్యోగి సోమవారం కళ్లకు గంతలు కట్టుకొని ఈఓ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి కాణిపాకం దేవస్థానం లో ఆరం జ్యోతి శంకరమ్మ అనే మహిళ విధులు నిర్వహిస్తోంది ఈమెకు గత మూడు  ఏళ్ల క్రితం పదోన్నతి రావాల్సి ఉంది. ఈ మేరకు తనకు రావాల్సిన పదోన్నతి కల్పించాలని ఈ ఓ వెంకటేష్ పలుమార్లు కోరినట్లు తెలిపారు.  అయితే ఆలయ ఈవో తనకు ప్రమోషన్ కల్పించకపోగా తన పట్ల అమానుషంగా మాట్లాడుతూ  దౌర్జన్యం చేస్తున్నట్లు తెలిపారు.  ప్రమోషన్ కల్పించాలని కోరుతూ ఈవో కార్యాలయానికి వెళ్లిన తనను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ మెడబట్టి బయటకు తోస్తానని మాట్లాడినట్లు తెలిపారు.  తన ప్రమోషన్ గురించి మాట్లాడితే పదేళ్లుగా నేను ఉద్యోగం లో ఉన్నాను. నాకు ఎవరు ప్రమోషన్లు ఇచ్చే వాళ్ళు లేరు నీకు ప్రమోషన్ ఇవ్వను అంటూ మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా ఈవో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగిస్తామని ఆమె తెలిపారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Kanipakam temple female employee innovative protest

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page