పేదలకు అండగా కేసీఆర్ వున్నారు-మోత్కుపల్లి

0 9,699

హైదరాబాద్ ముచ్చట్లు:

 

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం తెరాసలో చేరారు. అంతకు మందు అయన ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి, బషీర్ బాగ్ లోని బాబు జగ్జివన్ రావు,  అనంతరం గన్ పార్కు లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అయన వెంట మాజీ ఎస్సి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి,ఇతర కార్యకర్తలు వున్నారు.  మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ఇవాళ సంతోషకరమైన దినం. ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ ను బంగారు తెలంగాణ గా మార్చుతున్న కేసీఆర్. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది మంచి నాయకుడు కావాలి,పేద ప్రజలను ఆదుకునే నాయకుడు కావాలి అలాంటి నాయకుడే కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రి లను చూశా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ని చూడలేదు.రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు దళిత బంధు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులను అప్పుల బారి నుండి లేకుండా రైతు ను రాజు చేసేందుకు రైతు బంధు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులకు ఒక్కరికే కాదు ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. పేదలకు అండగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. కళ్యాణ లక్ష్మీ ,షాది ముబారక్ వంటి గొప్ప కార్యక్రమాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. పేదలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి  సమక్షంలో ఇవాళ టీఆరెస్ పార్టీ లో జాయిన్ అవుతున్నానని అన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: KCR is there for the poor – Motkupalli

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page