పశువుల సంతగా మారిన నూజివీడు దసరా ఎగ్జిబిషన్

0 9,013

నూజివీడు ముచ్చట్లు:

 

కృష్ణాజిల్లా నూజివీడు దసరా ఎగ్జిబిషన్ గ్రౌండ్ పశువుల సంతగా మారిన వైనం ఇది.  నూజివీడు పురపాలక సంఘ సూచనలతో ఏటా దసరా పండుగ సమయంలో చిన్నారుల వినోదానికి మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ దంకు ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మూడు రోజుల అనుమతితో నెలకొల్పిన ఎగ్జిబిషన్ తీరును చూసి ప్రజలు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైంట్ వీల్, కొలంబస్, ట్రైన్ వంటి యంత్రాలు పెట్టి అధిక రేట్లుతో టికెట్లు విక్రయించి నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారని వారి ఆరోపణ. అధిక ధరల మెనూతో తిను బండారాల విక్రయాలు జరిగాయని విమర్శిస్తున్నారు. మరో వైపు ఎగ్జిబిషన్ ప్రాంగణంలో అపరిశుభ్ర వాతావరణంతో నిండి,కోవిడ్ జాగ్రత్తలను విస్మరించిన నిర్వాకంపై పురపాలక అధికారుల చర్యలు శూన్యమని అంటున్నారు. భారీ జన సందోహంతో కిక్కిరిసి వున్న గ్రౌండ్ లో కంట్రోల్ చేసేందుకు సరిపడ సిబ్బంది లేరు. అంతేకాకుండా పండుగ సీజన్లో వస్తున్న జనాల వాహనాలకు ఎగ్జిబిషన్ నిర్వాహకులు పార్కింగ్ చూపకపోవడంతో ప్రధాన రహదారిపైనే నిలుపుతున్నారు. దాంతోరాకపోకలు  స్తoభించాయి. పోలీస్, రెవిన్యూ అధికారుల పర్యవేక్షణ అలసత్వంపై ప్రజానీకం పెదవి విరుస్తున్నారు.

 

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags’: Noojeedu Dussehra Exhibition, which has become a cattle fair

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page