బుధవారం నుంచి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

0 9,865

హైదరాబాద్  ముచ్చట్లు:

 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లపై లోటస్ పాండ్‌లో రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. చేవెళ్ళలో బుధవారం ఉదయం 11 గంటలకు షర్మిల భారీ భహిరంగ సభ జరగనుంది. అనంతరం అక్కడి నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. 14 నెలలు, 4 వేల కిలోమీటర్లు, 90 నియోజక వర్గాల్లో ఈ పాదయాత్ర జరుగుతుంది. ప్రతి రోజు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.ఈ తరం యువతకు నవతరం న్యాయకత్వం స్లోగన్‌తో షర్మిల పాదయాత్ర జరగనుంది. వైఎస్ సంక్షేమ పాలన ఎజెండాగా పాదయాత్ర సాగుతుంది. ప్రతి రోజు రచ్చ బండ మాదిరిగా మాట ముచ్చట కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నియోజక వర్గంలో మూడు మండలాలు టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. పాదయాత్రలో పార్టీలో చేరికలు.. గ్రామాల వారీగా పార్టీ బలోపేతంపై సమావేశాలు నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాల వారీగా పాదయాత్రలో 9 భారీ మహిరంగ సభలు షర్మిల నిర్వహిస్తారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Sharmila Prajaprasthanam Padayatra from Wednesday

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page