మంత్రి  హరీష్ రావు దత్తత గ్రామమైన కోలుగుర్ లో ఉద్రిక్తత

0 9,692

-ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

 

సిద్దిపేట ముచ్చట్లు:

 

- Advertisement -

సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోల్గురు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది, ముఖ్యమంత్రి కేసీఆర్  రెండవ సారి అధికారం చేపట్టాక సీఎం నియోజకవర్గంలో కోల్గురు గ్రామాన్ని ఆర్థిక శాఖ మంత్రి  హరీష్ రావు దత్తత తీసుకొని అన్ని విధాలుగా సకల హంగులతో గ్రామాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా  అభివృద్ధికి నోచుకోలేదని గ్రామస్తులు హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేసి రోడ్డుపై బైఠాయించారు.గ్రామంలో ఉన్న పెంకుటిల్లను కూల్చివేసి రెండు పడక గదులు కట్టిస్తామని గతంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించడం లేదు,  ఎన్నిసార్లు మంత్రి హరీష్ రావుకు విన్నవించుకున్నా  ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు, అధికారులకు చెప్పిన మా గోడు పట్టించుకోవడం లేదు,  ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇచ్చిన దాఖలాలు లేవని తెలిపారు,

 

 

 

ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు  ఇచ్చిన దాఖలాలు లేవని టీఆర్ఎస్ నేతలపై గ్రామస్తులు విరుచుకుపడుతున్నారు, ఎన్నిసార్లు హరీష్రావు దృష్టికి తీసుకువెళ్లిన ఇప్పటి వరకు ఫలితం లేకుండా పోయింది, అధికారులు వచ్చి తూతూమంత్రంగా సర్వేలు చేపడుతున్నారు, ఇంతవరకు గ్రామం అభివృద్ధి దిశలో లేదని గ్రామస్థులు వాపోతున్నారు,తమకు ఉన్న ఇండ్లను కూల్చివేసి  రెండు నెలల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని మంత్రి హామీ ఇచ్చిన ఇప్పటివరకు కట్టించక పోవడం సిగ్గుచేటు అని అన్నారు, పూరిగుడిసెలో నివాసముంటూ జీవనం గడుపుతున్నాము, పూరి గుడిసెల్లోకి వరద నీరు రావడంతో భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు, ఇప్పటికైనా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి తమకు న్యాయం చేకూరాలని గ్రామస్తులు తెలిపారు..

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Tension in Kolugur, a village adopted by Minister Harish Rao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page