తెరాస చేసిన అభివృద్ది శూన్యం

0 9,700

హుజూర్ నగర్ ముచ్చట్లు:

 

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం నేరేడు చర్ల లో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో టీపీసీసీ మాజీ ఛీఫ్  కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గోన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ కాంగ్రేస్ కంచుకోట. హుజూర్ నగర్ లో ఓ దొంగల ముఠా వచ్చింది. ల్యాండ్..శాండు.. మైనింగ్స్..వైన్స్ తప్ప టి.ఆర్.యస్ చేసింది ఏమి లేదు. రాబందుల్లా జనం మీద పడి ప్రజల రక్తం పిలుస్తున్నారు. మఠం పల్లి లో అటవీ భూముల కబ్జా. చింతల పాలెం మండల లో వందల ఎకరాల కబ్జా. హుజూర్ నగర్ మున్సిపాల్టీ లో  మాఫియా. పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో 50 వేల మెజార్టీ తో కాంగ్రేస్ పార్టీ గెలవబోతుంది. టి.ఆర్.యస్ చేసిన అభివృద్ది చేసింది శూన్యం. హుజూర్ నగర్ లో డిగ్రీ కళాశాల,వంద పడకల హాస్పిటల్ ను లిఫ్ట్ లను ఏర్పాటు చేసింది ..నియోజక వర్గ వ్యాప్తంగా రోడ్లు ఉత్తమన్న కాదా అని ప్రశ్నించారు.  ప్రధాని మోదీ,  సీఎం కేసీఆర్ కలసి ప్రజలను మోసం చేసిండ్రు. మోదీ 15 లక్షలు ఖాతాలో వేసిన్ద్ర అని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. మోదీ కి సిగ్గు ఉందా..సిగ్గు శరం ఉందా. పాఠశాల ల్లో టీచర్ల కొరత ఉంది. .కేసీఆర్ ప్రభుత్వం లో టీచర్ల కొలువులు లేవు..ప్రభుత్వం ఉద్యోగాలు లేవు. ఇక్కడ యం.ఎల్.ఏ  సై  అన్నాడు ఉద్యోగాలు ఏవి. రేషన్ బియ్యం లో కూడా వాటాలు..బ్లాక్ మార్కెట్ కు తరలిసిస్తూన్నారు.

 

 

 

 

- Advertisement -

మద్యం దందా కొనసాగుతుంది. కేసీఆర్ కుటుంబం లో కొలువులు ఉన్నాయి..ఇక్కడ నిరుద్యోగులకు కొలువులు లేవు. వచ్చిన కార్యకర్తలు అందరు స్వచ్ఛందంగా వచ్చారు. 94 లో యం.ఎల్.ఏ ఒడిపోయాను…99 లో గెలిచాను. 2014 లో కాంగ్రేస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను. 2015 లో పి.సి.సి ప్రెసిడెంట్ గా పనిచేశా. వరుసగా 6 సార్లు ఓటమి లేకుండా గెలిపించారు. ఏనాడు అధికారాన్ని దాచుకొని,దోచుకోవడానికి  వాడలేదు. నియోజకవర్గ ప్రజలు మా కుటుంబ సభ్యులు. ప్రాణం ఉన్నంత వరకు మీ కోసమే పని చేస్తాం. హుజూర్ నగర్,కోదాడ కాంగ్రెస్ అడ్డ. అందరం కుటుంబ సభ్యులుగా పోదాం. ఎవరికి భయవడవద్దు. సత్యమే జయిస్తుంది..నీతి నిజాయితీని గుర్తిస్తారు. పోలీసులను అడ్డం పెట్టుకొని నియోజక వర్గాన్ని లూటీ చేస్తున్నారు.  చెక్ డ్యామ్ లు రైతులకు అవసరం విధంగా  నీరు నిల్వ కోసం నిర్మాణం చేపడతారు…యం.ఎల్.ఏ కమీషన్ కోసం డిజైన్ ప్రకారం కట్టకుండా మరోచోట కట్టి కమీషన్ ల కోసం కడుతున్నారని అన్నారు.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; The development made by Teresa is null

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page