మహిళా సాధికారతే వైకాపా లక్ష్యం – ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

0 9,688

నెల్లూరు ముచ్చట్లు:

 

వై.యస్.ఆర్.ఆసరా 2 వ విడత సంబరాల్లో భాగంగా నేడు బాలాయపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆనం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత, ఆర్థిక స్వాలంభన, సుస్థిరమైన ఆర్థికాభివృద్ది, వారి కుటుంబాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ,వై ఎస్ ఆర్ ఆసరా పథకం ద్వారా, నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి రెండో విడత నగదు జమ చేయడం జరుగుతుందని  పేర్కొన్నారు.గత  ప్రభుత్వం డ్వాక్రా అక్క చెల్లెమ్మ లను మోసం చేసి, వారికి రుణ మాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ, మహిళలను మనోవేదనకు గురిచేయగా, పాదయాత్ర సందర్భంగా   వైయస్ జగన్మోహన రెడ్డి  మహిళల ఇబ్బందులను స్వయంగా అర్థం చేసుకుని,ఇచ్చిన మాట ప్రకారం మాట ప్రకారం, మడమ తిప్పకుండా 4 విడతల్లో డ్వాక్రా మహిళల బకాయిలను మాఫీ చేస్తానంటూ , ప్రవేశ పెట్టిన మహత్తర సంక్షేమ పధకమే  వైయస్సార్ అసరా గా తెలిపారు.నియోజకవర్గ పరిధిలో 6 మండలాలు,వెంకటగిరి మునిసిపాలిటీ లోని అక్కచెల్లెమ్మలను,ఈ కార్యక్రమాల ద్వారా నేరుగా కలుసుకొని, వారి కష్టసుఖాలను తెలుసుకోవడానికి, వారితో నేరుగా 4 మంచి మాటలు చెప్పడానికి, మీ సోదరునిగా  కలవడం ఈ ఆసరా వారోత్సవాల సందర్భంగా జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు.

 

 

- Advertisement -

మరీ ముఖ్యంగా,ప్రస్తుత కరోన మహమ్మారితో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, ముఖ్యమంత్రివర్యులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ,ఈ ఆసరా వారోత్సవాలను  దిగ్విజయంగా నిర్వహించడానికి మహిళల ఆశీర్వాద బలంతోనే సాధ్యమైందన్నారు.ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ  నాయకులకు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచ్ లు, సహకార సంఘాల అధ్యక్షులు, , మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అందరికీ  తన అభినందనలు తెలిపారు.బాలాయపల్లి మండల పరిధిలోని మొత్తం పొదుపు గ్రూపుల సంఖ్య 821, సభ్యుల సంఖ్య 8574 గా ఉందన్నారు.వైయస్సార్ ఆసరా మొదటి విడతలో సంఘాలు 527 రూ. 3.83 కోట్లు,రెండో విడతలో సంఘాలు 533  రూ 3.91  కోట్లు నిధులు పంపిణీ చేశామన్నారు.నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మొదటి విడతలో 30459 సంఘాలకు రూ. 232.54 కోట్ల లబ్ది చేకూరిందన్నారు.జిల్లాలో రెండో విడతలో సంఘాలు 39,728, రూ 307.21 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు.వెంకటగిరి నియోజకవర్గంలో వైయస్సార్ ఆసరా ద్వారా మొదటి విడతలో 4,222 సంఘాలకు రూ. 29.84  కోట్ల లబ్ది పొందారని పేర్కొన్నారు.రెండో విడతలో సంఘాలు 4289, రూ 30.77 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Vaikapa’s goal is women’s empowerment – MLA Anam Ramanarayana Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page