అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆకాష్ పూరి ‘రొమాంటిక్’

0 9,688

హైదరాబాద్‌ ముచ్చట్లు:


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న  రొమాంటిక్ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనుకున్నదానికంటే ఓ వారం ముందుగానే సినిమాను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 29న ఈ చిత్రం థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీని ప్రకటిస్తూ వదిలిన పోస్టర్‌లో కేతిక శర్మ.. ఆకాష్ పూరి ఇద్దరి జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యేట్టు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని పూరి  జగన్నాథ్ నిర్మించడమే కాకుండా.. కథను, మాటలు, స్క్రీన్ ప్లేను అందించారు. పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి తెరకెక్కిస్తున్నారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘రొమాంటిక్’ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తుండగా.. నరేష్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు.
మేకర్స్ ఇప్పటి వరకు మూడు పాటలను రిలీజ్ చేశారు. అన్నీ కూడా అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి.
తారాగ‌ణం: ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ట‌, మ‌క‌రంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్‌, సునైన‌

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

- Advertisement -

Tags; Akash Puri’s ‘Romantic’ to be released worldwide on October 29

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page