శ్రీ‌వారిమెట్టు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలోఅష్ట‌బంధ‌న మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మాలు ప్రారంభం

0 9,741

తిరుపతి ముచ్చట్లు:

 

శ్రీ‌నివాస‌మంగాపురం స‌మీపంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద గ‌ల శ్రీ వేంటేశ్వ‌ర‌ స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మాలు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి.ఇందులో భాగంగా ఉదయం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత‌రం బుధ‌వారం శ్రీ భోగ‌శ్రీ‌నివాస‌మూర్తిని ప్ర‌తిష్టించ‌నున్న నేప‌థ్యంలో ఉద‌యం అభిషేకం, స్న‌ప‌న‌తిరుమంజ‌నం చేప‌ట్టారు. అదేవిధంగా క్షీరాధివాసం నిర్వ‌హించారు. సాయంత్రం విశేష హోమాలు, అష్ట‌బంధ‌నం నిర్వ‌హిస్తారు.అక్టోబ‌రు 20న‌ ఉద‌యం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి అభిషేకం, హోమాలు, పూర్ణాహుతి, ఆవాహ‌న అర్చ‌న నిర్వ‌హిస్తారు. ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌హాసంప్రోక్ష‌ణ జ‌రుగ‌నుంది.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో   ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్  ర‌మ‌ణ‌య్య‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

Tags: Commencement of Ashtabanda Mahasamprakshan programs at Srivarimettu Sri Venkateswaraswamy Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page