ఆసరా చెక్కుల పంపిణీ

0 7,562

ఏలూరు ముచ్చట్లు:

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం   పొలమూరు , మాముడూరు సంబంధించి పొలమూరు హైస్కూల్ గ్రౌండ్ నందు గ్రామ సభలో లబ్ధిదారులకు వైఎస్సార్  ఆసరా చెక్కును   రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు , జిల్లా పరిషత్ చైర్మన్ కవురు  శ్రీనివాస్ లు  అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ ను మంత్రి శ్రీరంగనాధ రాజు, తదితరులు శాలువా కప్పి  ఘనంగా సన్మానించారు.అనంతరం సభలో మంత్రి రంగనాధ రాజు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, ముఖ్యమంత్రి పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని, పశ్చిమగోదావరి జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండి నడిపించాలని సూచించారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజల్లో సుస్థిరమయిన స్థానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాదించుకున్నారని, ఆయన స్పూర్తితో ముందడుగు వేయాలన్నారు.
నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

- Advertisement -

Tags:Distribution of support checks

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page