ఆర్టీసి కి ఆదాయం సమకూరడం పట్ల ఉద్యోగులకు స్వీట్ల పంపిణీ

0 74,763

జగిత్యాలముచ్చట్లు:

 

దసరా పండుగ సందర్భంగా సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 14 కోట్ల ఆదాయం సమకూరడం పట్ల  జగిత్యాల డిపోలో డిపో మేనేజర్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ  ఉద్యోగులకు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. అలాగే జగిత్యాల డిపో కి 20 లక్షల ఆదాయం రావడంతో పాటు చాలా రోజుల తర్వాత 72 శాతం ఆక్యుపెన్సీ సాధించడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డిపో మేనేజర్ ఆర్టీసీ ఉద్యోగులకు మిఠాయి పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు ఆర్టీసీ బస్సులు వినియోగించుకుని సంస్థ అభివృద్ధికి సహకరించగలరని ఈ సందర్భంగా డిపో మేనేజర్ జగదీశ్వర్ సూచించారు.

- Advertisement -

కోరుట్ల ఆర్టీసీ డిపోలో సంబరాలు

దసరా పండుగ సందర్భంగా సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 14 కోట్ల ఆదాయం సమకూరడం పట్ల కోరుట్ల డిపోలో డిపో మేనేజర్ కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ  ఉద్యోగులకు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా
కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్  కృష్ణ మోహన్ మాట్లాడుతూ దసరా బతుకమ్మ పండుగ సందర్భాలలో సోమవారం ఒక్క రోజే మొత్తం టీఎస్ ఆర్టీసీకి 36.30 లక్షల కిలోమీటర్ల కి 14 కోట్ల79 లక్షలు కోరుట్ల ఆర్టీసీ సంస్థకి అత్యధిక ఆదాయం వచ్చినది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యంత రికార్డును సంపాదించుకున్న ఈ రికార్డ్ ప్రయాణికులకు అంకితం ఆని ఎండీ సజ్జనార్  టిఎస్ ఆర్టీసీ నూతనంగా బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంలో ఆర్టీసీలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్న ఎండీ సజ్జనార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే
మా టిఎస్ ఆర్టీసీ ని ముందుకు తీసుకెళుతున్న ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోరుట్ల డిపోకు  29,646 కిలోమీటర్ లకు గాను 94,7622  రూపాయలు రావడం జరిగింది.ఇట్టి అత్యధిక ఆదాయం రావడానికి ఆర్టీసీని ఆదరించిన  ప్రయాణికులకు డిపో మేనేజర్ కృతజ్ఞతలు తెలిపినారు. అలాగే డిపోలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా చాలా చక్కగా పనిచేశారని సిబ్బందిని అభినందించి, ఉద్యోగులందరికి స్వీట్ లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగిందని డిపో మేనేజర్ కృష్ణ మోహన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కృష్ణ
మోహన్ ,ట్రాఫిక్ సూపరిడెంట్  జి.పి.సింగ్ నాయక్ ,ఆఫీస్ సూపరిడెంట్ శ్రీనివాస్,మెకానికల్ ఫోర్ మెన్ తిరుపతి, ఉద్యోగులు పాల్గొన్నారు.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Distribution of sweets to employees to generate revenue for RTC

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page