సుందిళ్ళ లో ఉచిత మెడికల్ క్యాంప్.

0 7,578

పెద్దపల్లి ముచ్చట్లు:

ఆర్జి 1 ఏరియా పరిదిలోని ప్రభావిత (గామాల ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా రామగుండం ఏరియా 1 జీఎం కె.నారాయణ సూచన మేరకు ప్రతి నెల ప్రభావిత (గామాలైన సుందిళ్ళ, జనగామ, ముస్త్యాల (గామాలలో ఉచిత మెడికల్ క్యాంప్ లను నిర్వహించటం జరుగుతుంది. మంగళవారం సుందిళ్ళ (గామంలో ఉచిత మెడికల్ క్యాంప్ ను నిర్వహించటం జరిగింది. సింగరేణిలో సి అండ్ ఎం డి ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా  ఉన్న ప్రభావిత (గామాల ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఉచిత వైద్య శిభిరాలను  లను నిర్వహించటం జరుగుతుంది. ప్రజల ఆరోగ్య విషయంలో సింగరేణి ఉద్యోగులతో పాటు ప్రభావిత (గామా ప్రజల ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని  అన్నారు. ఈ రోజు నిర్వహించిన సుందిళ్ళ మెడికల్ క్యాంప్ కు సుమారు 110 మంది హాజరు కావటం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డా. సుమన్, డా. అజయ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్, హాస్పిటల్ సిబ్బంది చాంద్ పాషా, సురేశ్ పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Free Medical Camp in Sundilla

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page