మానవసేవయే మాధవసేవ

0 9,671

బేతంచర్ల ముచ్చట్లు:

 

మానవసేవయే మాధవసేవ  అనే నినాదంతో ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ పండగని పురస్కరించుకొని ఈరోజు మహమ్మద్ ప్రవక్త జయంతిని మిలాద్ ఉన్ నబీ పండగగా జరుపుకుంటారని ఈ  సందర్భంగా  మత సామరస్య చైతన్య వేదిక,  హెల్పర్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అనాధలకు వృద్ధులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ లను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమం  మొదటగా బేతంచెర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బాలింతలకు డాక్టర్ నాగరాణి చేతుల మీదుగా బ్రెడ్లు,  పళ్ళను పంపిణీ చేశారు.  అనంతరం చిన్నపిల్లల అనాధ ఆశ్రమం,  మిస్పా వృద్ధాశ్రమాలలో పండ్లు పంపిణీ చేశారు.  సామరస్య చైతన్య వేదిక అధ్యక్షుడు నూర్ అహ్మద్ సభ్యుడు సత్తార్ వృద్ధులకు బ్రెడ్లు,  పండ్లను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాహ్మద్ ప్రవక్త అడుగుజాడల్లోనే తాము నడుస్తున్నా మని ప్రతి ఒక్కరు సేవాభావం అలవర్చుకోవాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ జయంతి గౌడ్, రఫీ,  గూటం భగవాన్,  జాకీర్,  స్వాములు,  యాకోబ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Madhavaseva is the human service

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page